సుదూర ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవితాలను సులభతరం చేసేందుకు తమ ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెడుతోందన్నారు. వీటి ద్వారా యువతను గ్రామాలకు తిరిగి తీసుకు రావడానికి తాము ప్రయత్నిస్తున్నామని అన్నారు.
ఉత్తరాఖండ్ రోజ్ గార్ మేళాను ఆయన ఈరోజు వర్చువల్‌గా ప్రారంభించారు. నూతనంగా నియామక పత్రాలు పొందిన వారిని ఆయన అభినందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… గతంలో జీవనోపాధి కోసం ఇక్కడి యువత పెద్ద నగరాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి వుండేదన్నారు.
ఇది దేశ యువతకు అపూర్వమైన అవకాశాల అమృత్ కాలం అన్నారు. అది నిర్మాణ రంగమైనా లేదా ఇంజినీరింగ్, మెటీరియల్ బిజినెస్, చిన్న వ్యాపారమైనా ఇప్పుడు ఉద్యోగవకాశాలు పెరుగుతున్నాయన్నారు. రవాణా రంగంలో డిమాండ్ పెరగడంతో ఉత్తరఖండ్ యువతకు తాజాగా ఉద్యోగవకాశాలు పొందుతోందన్నారు.
నూతన నియమితులైన అసిస్టెంట్ టీచర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. కొత్త విద్యా విధానం ప్రకారం రాష్ట్ర యువతను కొత్త శతాబ్దానికి సిద్ధం చేయాలని ఆయన కోరారు. పెద్ద మార్పుకు ఉపాధ్యాయులు ఒక మాధ్యమమని అన్నారు.