భీష్మతో సక్సెస్ కొట్టి ఊపుమీదున్న హీరో నితిన్. తాజాగా నితిన్-కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం రంగ్ దే. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫుల్ స్పీడ్ గా నడుస్తున్నాయి. ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ చేయటంతో పాటు రిలీజ్ రైట్స్ దక్కించుకునేందుకు పలు సంస్థలు పోటీ పడుతున్నాయి.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నాగ వంశీ నిర్మిస్తున్నారు. నాగ వంశీ ఫైనల్ గా 36కోట్లకమ్మేందుకు ముందుకు రాగా, జీ స్టూడియోస్ సంస్థ 35కోట్ల వరకు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఓటీటీ, శాటిలైట్ రైట్స్ సహా రిలీజ్ కూడా జీ స్టూడియోస్ చూసుకోనుంది. ఈ ఫార్మూలాతో ఇప్పటికే సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను జీ స్టూడియోస్ కొనుగోలు చేసింది.