ఏపీలో రాజ్యంగ సంక్షోభం జరుగుతోదంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు ఇచ్చిన అన్ని ఆదేశాలను నిలుపుదల చేస్తూ సుప్రీం కోర్టు స్టే విధించింది. చీఫ్ జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని బెంచ్ హైకోర్టులో జస్టిస్ రాకేష్‌కుమార్, జస్టిస్ ఉమాదేవి బెంచ్ ఆదేశాలు, విచారణను తప్పుబట్టింది. హైకోర్టు ఆదేశాలు ఆందోళనకరంగా ఉన్నాయన్న సుప్రీం చీఫ్ జస్టిస్…. ప్రభుత్వం వేసిన ఎస్.ఎల్.పి ని విచారించింది.
రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను న్యాయవాది సిద్దార్థ లూథ్రా వ్యతిరేకించగా… సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ఎన్నాళ్లనుంచి ప్రాక్టీసు చేస్తున్నారంటూ సుప్రీం ప్రశ్నించింది. ఇలాంటి ఆదేశాలు ఎప్పుడైనా ఇచ్చారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, కనీసం హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణకు అనుమతించాలన్న సిద్దార్థ లూథ్రా అభ్యర్థనను కూడా సమర్థించలేదు. రాజ్యాంగం సంక్షోభం ఉందనే భావనతో జడ్జి ప్రభావితం అయినందున…. అన్ని విచారణలపైనా స్టే విధిస్తున్నామన్న సుప్రీంకోర్టు, రాజ్యాంగ సంక్షోభం అంశం, దానితో సంబంధం ఉన్న పిటిషన్ల ఆదేశాలపై స్టే కొనసాగుతుందని తెలిపింది.
ఇతర అంశాలను సెలవుల తర్వాత విచారిస్తామని వాయిదా వేసింది. ప్రభుత్వ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అడ్వకేట్ జనరల్ శ్రీరాం వాదనలు వినిపించారు.