‘కాంతార’సినిమాకు ఊరట లభించింది. సినిమా నుంచి వరాహ రూపం పాటను తొలగించాలన్న కేరళ హైకోర్టు ఆదేశాలను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. దర్శకుడు రిషబ్‌శెట్టి, నిర్మాత విజయ్ కిరందూర్ ఈ నెల 12,13వ తేదీల్లో హాజరైతే అరెస్టు చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.
సినిమాలోని వరాహ రూపం సాంగ్ కాపీ అని థైక్కుడం బ్రిడ్జ్ అనే సంస్థ ఆరోపించింది. తాము రూపొందించిన థైక్కుడం బ్రిడ్జ్ నవరసం అని క్రియేట్ చేసిన ఆల్బమ్‌ను కాంతార టీమ్ వరాహ రూపంగా మార్చేసి కాపీ కొట్టారని ఆరోపణలు చేశారు. ఈ మేరకు గతేడాద నవంబర్ లో కాంతారా టీమ్ పై కేసు నమోదైంది.
దీంతో ఈ పాటపై వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఓటీటీ నుంచి ఆ పాటను తొలగించి దాని స్థానంలో మరో పాటను పెట్టారు. ఇక భారీ అంచనాల నడుమ ఈ సినిమా గతేడాది సెప్టెంబర్ లో విడుదలైంది. అంచనాలకు మించి ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది.
దీంతో ఈ సినిమాను మేకర్స్ డబ్ చేసి పలు బాషల్లో విడుదల చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తీసుకు వచ్చే పనిలో మేకర్స్ ఉన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపకుంటున్నట్టు తెలుస్తోంది.