పవన్ కళ్యాణ్ నెక్ట్స్ మూవీ కూడా రీమేక్ మూవీనే. అయ్యపురం కోష్యిం రీమేక్ సినిమాలో పవన్ నటించనుండగా, రానా దగ్గుబాటి కీలక పాత్ర చేయబోతున్నారు. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్, డైలాగ్స్ అన్నీ త్రివిక్రమ్ దగ్గరుండి చూసుకుంటున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో వచ్చే ఏడాది మొదటి వారం నుండి షూటింగ్ ప్రారంభం అయ్యింది.
అయితే, ఈ సినిమా కోసం త్రివిక్రమ్ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. కథ పర్యవేక్షణ, డైలాగ్స్ కోసం ఏకంగా 10కోట్లు తీసుకోనుండగా… లాభాల్లో ఏకంగా 50శాతం లాభాలు ఆయనకే దక్కనున్నాయి. ఈ మూవీలో సాయి పల్లవి, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ఈ మూవీ షూట్ ఎక్కువ భాగం పొలచ్చిలో జరగనుంది. మార్చి వరకు సినిమా షూట్ పూర్తి చేసి, సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు.