తెలంగాణ బీజేపీ నేతలు రాణి రుద్రమ, జిట్టా బాలకృష్ణ రెడ్డిలకు బిగ్ షాక్ తగిలింది. 18 కోట్ల రుణ ఎగవేతకు సంబంధించి వీళ్ల ఆస్తుల వేలానికి సిద్ధమైంది రిలయన్స్ సంస్థ. ఈ మేరకు పత్రికా ప్రకటన కూడా ఇచ్చింది.
జర్నలిస్టుగా పేరుగాంచిన రాణీ రుద్రమ.. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. యువ తెలంగాణ పార్టీని స్థాపించారు. తర్వాత బీజేపీలో విలీనం చేశారు. అయితే.. బీజేపీలోకి చేరకముందు రాణీ రుద్రమ, జిట్టా బాలకృష్ణారెడ్డి ఇద్దరూ లక్ష్మీ విలాస్ బ్యాంక్ నుంచి రూ.18 కోట్లకు పైగా లోన్ తీసుకున్నారు. అయితే.. ఆ అప్పు చెల్లించకపోవడంతో వారి ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంకు అధికారులు రంగంలోకి దిగారు.
ఒకట్రెండు సార్లు నోటీసులు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో ఆస్తుల జప్తు వ్యవహారాన్ని రిలయన్స్ అస్సెట్ రీకన్ స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించింది సదరు బ్యాంక్. దీంతో రిలయన్స్ సంస్థ రాణీ రుద్రమ, జిట్టా ఆస్తులను వేలం వేస్తూ ప్రకటన ఇచ్చింది.
ఇంత రాద్ధాంతం జరుగుతున్నా రాణీ కానీ, జిట్టా కానీ ఎక్కడా రియాక్ట్ అవ్వలేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా దీనిపై స్పందించలేదు. ఈ లోన్ వ్యవహారంపై కోర్టులను ఆశ్రయించినా ఎదురుదెబ్బే తగిలిందని వార్తలు వస్తున్నాయి.