బీజేపీ మిత్రపక్షం నితీష్ కుమార్ కు షాక్ తగిలింది. సీఎం నితిష్ కుమార్ పార్టీ జేడీయూకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి బీజేపీలో చేరారు. అరుణాచల్ ప్రదేశ్ లో జేడీయూకు ఏడుగురు ఎమ్మెల్యేలుండగా… ఆరుగురు పార్టీ మారటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఆరుగురిలో ముగ్గురిని ఇప్పటికే పార్టీ సస్పెండ్ చేసింది.
దీనిపై అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు వాంఘే… ప్రజలు అభివృద్ధి వైపు నిలిచారు, సీఎం-ప్రధానిపై నమ్మకం ఉంచారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారటంతో తాము ప్రతిపక్ష హోదాలోకి వెళ్లిపోయామని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగీ అన్నారు. అయినా సరే తాము బీజేపీకి మద్దతిస్తామని స్పష్టం చేశారు. తమకు ప్రతిపక్ష హోదా దక్కినా, తాము స్నేహపూర్వక ప్రతిపక్షం గానే కొనసాగుతామని కేసీ త్యాగీ తెలిపారు.
బీహార్ లో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో… నితీష్ కూడా సైలెంట్ గా ఉన్నట్లు కనపడుతుంది.