ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితులకు బెయిల్ లభించడం కష్టతరం అవుతోంది. తాజాగా మరోసారి కోర్టు వారికి షాకిచ్చింది. సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబుకు బెయిల్ నిరాకరించింది.
వీరందరిపై కీలకమైన ఆధారాలను ఈడీ అధికారులు కోర్టు ముందు ఇదివరకే ఉంచారు. ఇరువైపుల వాదనలు విన్న రౌస్ ఎవెన్యూ కోర్టు మనీ లాండరింగ్ వ్యవహారంలో నమోదైన కేసుల్లో నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది.
నిందితులు 3 నెలలుగా తీహార్ జైలులో ఉంటున్నారు. కేసు దర్యాప్తులో ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దని కోర్టును ఈడీ కోరింది. నిందితులు కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందన్న వాదించింది. ఈ క్రమంలోనే వారి పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
ఈ కేసులో ఈడీ, సీబీఐ దూకుడు ప్రదర్శిస్తున్నాయి. వరుస అరెస్టులతో కేసు దర్యాప్తును స్పీడప్ చేశాయి. మొన్న మాగుంట రాఘవ, గోరంట్ల బుచ్చిబాబును అరెస్టు చేశారు అధికారులు. నెక్ట్స్ ఎవరి అరెస్ట్ ఉంటుందో అనే ఉత్కంఠ నెలకొంది.