విడుదలైన అన్ని భాషల్లో సంచలన విజయం సాధించిన కేజీఎఫ్ కు సీక్వెల్ గా రూపొందుతున్న సినిమా కేజీఎఫ్ చాప్టర్-2. హిందీ సహా అన్ని భాషల్లోనూ ఈ మూవీ రాబోతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని ఇప్పటికే డిసైడ్ అయ్యారు.

కరోనా ఎఫెక్ట్ తో వాయిదాపడ్డ ఈ సినిమా షూటింగ్ ను అక్టోబర్ నుండి మొదలుపెట్టాలని ఇటీవలే డిసైడ్ అయ్యారు. ఈ సినిమాలో విలన్ రోల్ చేస్తున్న సంజయ్ దత్ కు సైతం విషయం చెప్పగా ఆయన కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. కానీ ఉన్నట్లుండి సంజయ్ దత్ కు లంగ్ క్యాన్సర్ అని, పైగా స్టేజ్-3లో ఉండటంతో ఆయన హుటాహుటిని అమెరికాలో వైద్యానికి బయలుదేరుతున్నారు.
దీంతో కేజీఎఫ్ యూనిట్ షాక్ గురైందని తెలుస్తోంది. సంజయ్ దత్ త్వరగా కోలుకుంటే ఓకే లేదంటే ఎలా అన్న మీమాంసలో ఉన్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు సంజయ్ దత్ కు రీప్లేస్ చూడకుండా… కొంతకాలం వేచి చూడాలని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.