రేవంత్ రెడ్డిని నేరుగా కొట్టలేకే కేటీఆర్ తెర వెనుక కుట్రలు స్టార్ట్ చేశారా…? రేవంత్ వద్దకు వెళ్లే జర్నలిస్టుల్లో కేటీఆర్ కోవర్టులున్నారా…? కేటీఆర్ తెర వెనుక కుట్రలకు టీఆర్ఎస్ నేతలు సైతం మండిపడుతున్నారా…? రేవంత్ రెడ్డి ఎలా కేటీఆర్ వ్యూహాన్ని ఎలా ఎదుర్కొగలిగారు?
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొంతకాలంగా కేటీఆర్ ను ఫుల్ టార్గెట్ చేశారు. ముఖ్యంగా సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటనలో కేటీఆర్ ను రేవంత్ రెడ్డి కడిగేశారు. డ్రామారావ్ అంటూ తిట్టిపోశారు. అయితే, కేటీఆర్ కూడా రాజకీయంగా ఎదురుదాడి చేస్తారని అంతా ఊహించినప్పటికీ… కోవర్టు రాజకీయానికి తెరలేపారు. తను పిచ్చపాటిగా మాట్లాడిన మాటలను రికార్డు చేయించారు. తమకు పొలిటికల్ గా అడ్వాంటేజ్ అనుకొని ట్విట్టర్ ద్వారా ఫిర్యాదులు చేశారు. కాంగ్రెస్ నేతపై ఓ టీఆర్ఎస్ నాయకుడు కాంగ్రెస్ అధినాయకత్వానికి ఫిర్యాదు చేయటమే పెద్ద ఆశ్చర్యం అని విశ్లేషకులు సైతం కామెంట్ చేస్తున్నారు.
అయితే, ఈ మొత్తం వ్యవహరంలో రేవంత్ రెడ్డి వేగంగా స్పందించారు. కేటీఆర్ ట్వీట్ పై రాజకీయంగా డ్యామేజ్ కాకముందే కేటీఆర్ కోవర్టు రాజకీయంపై నేరుగా ఎంపీ శశిథరూర్ తోనే మాట్లాడారు. తన మాటలకు క్షమాపణ చెప్పటంతో పాటు టీఆర్ఎస్, కేటీఆర్ పై తన పోరాటాన్ని రేవంత్ వివరించారు. దీంతో శశిథరూర్ కూడా కన్విన్స్ అయ్యారు. ఇంకేముంది రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ నుండి తొలగించేస్తారు… మాకో తలనొప్పి తగ్గుతుంది అన్నంత రేంజ్ లో ఊహించుకున్న కేటీఆర్ కు చుక్కెదురైందని విశ్లేషకులంటున్నారు.
నేను ఇక్కడ ప్రభుత్వంపై పోరాడుతుంటే 40కేసులు బనాయించారని, రెండుసార్లు జైలుకు పంపారని రేవంత్ రెడ్డి శశిథరూర్ కు వివరించారు. కాంగ్రెస్ శ్రేణులంతా టీఆర్ఎస్ పై పోరాడుతున్న సమయంలో మీరు పొగడటంతో తమ నైతిక స్థైర్యం దెబ్బతింటుందనే అలా మాట్లాడాల్సి వచ్చిందని రేవంత్ థరూర్ కు క్షమాపణ చెప్పారు. థరూర్ కూడా నేను అలా అనాల్సింది కాదని, మీ పోరాటం కొనసాగించాలని కోరినట్లు వివరించటంతో వివాదం టీ కప్పులో తుఫానులా ముగిసిపోయింది.