కొన్నాళ్లుగా ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఫిలింనగర్ భూములపై వివాదం కొనసాగుతోంది. కాస్ట్లీ ఏరియాలో 10ఎకరాల భూమిని రెడ్ ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్ కి అప్పగించింది ప్రభుత్వం. అయితే అక్కడ మరో 4 ఎకరాల భూమి కబ్జాకు గురయ్యిందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఆ భూమిలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిని కూల్చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలిసి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అక్కడకు వెళ్లారు. అయితే.. గుడి విషయంలో ఆయన రాజకీయం చేసేందుకు ప్రయత్నించారని ఫిలింనగర్ వాసులు నిలదీస్తున్నారు.
రాజాసింగ్ తీరుపై సొంత పార్టీ కార్పొరేటర్ వెంకటేష్ సహా కార్యకర్తలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఫీస్ దగ్గరకు రండి మాట్లాడుకుందాం అంటూ రాజాసింగ్ జారుకున్నారని చెబుతున్నారు.