పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా మరో ఐదుగురు ప్రముఖ నేతలు కాంగ్రెస్ పార్టీని వీడారు. ఇప్పటికే ప్రముఖ నేత సునీల్ జాఖడ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడారు. ఈ నేపధ్యంలో తాజాగా మరో ఐదుగురు పార్టీని వీడటం కాంగ్రెస్ కు ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా పార్టీని వీడిన వారిలో పంజాబ్ మాజీ మంత్రులు గురుప్రీత్ సింగ్ కంగర్, రాజ్ కుమార్ వెర్కా, బల్బీర్ సింగ్ సంధూ, మాజీ ఎమ్మెల్యే కేవల్ సింగ్ ధిల్లాన్, సుందర్ శ్యామ్ అరోరాలు బీజేపీ గూటికి చేరారు.
గత నెలలో పంజాబ్ కాంగ్రెస్ కు ఆ పార్టీ మాజీ చీఫ్ సునీల్ జాఖడ్ రాజీనామా చేశారు. అనంతరం ఆయన కాషాయ పార్టీలో చేరారు. ఇక అప్పటి నుంచి పెద్ద సంఖ్యలో నేతలు కాంగ్రెస్ కు గుడ్ బై చెబుతున్నారు.
ఇక త్వరలో మరి కొందరు నాయకులు కూడా పార్టీ వీడే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ నుంచి వలసలు కొనసాగటం పార్టీ అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. వలసలకు పుల్ స్టాప్ పెటేందుకు అదిష్టానం రెడీ అవుతోంది.