తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపిస్తానని, అధికారమే లక్ష్యంగా 2023 ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటిస్తున్న వైఎస్ షర్మిల… ఏప్రిల్ 9న పార్టీ పేరును ప్రకటించబోతున్నారు. ఖమ్మం జిల్లాలో జరిగే సభ ద్వారా పార్టీ ప్రకటన, విధివిధానాలు, ఎందుకు తెలంగాణ రాజకీయాల్లోకి రాబోతున్నారో చెప్పనున్నారు.
అయితే, తెలంగాణలో వైసీపీతో ఉన్న కీలక నేతలంతా షర్మిల వెంట నడుస్తుండగా… వైసీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఆమెకు షాక్ ఇచ్చారు. సామాన్య కార్యకర్తనైన తనకు మంచి గుర్తింపు ఇచ్చారని, అయితే తన నియోజకవర్గం హుజుర్ నగర్ లో ఉన్న పరిస్థితుల మేరకు తాను జాతీయ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్ల తెలిపాడు. అందుకే రాజీనామా చేస్తున్నానని… తనను ఆదరించిన జగన్ కు కృతజ్ఞతలు అంటూ ప్రకటించాడు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా ఉద్యమ లక్ష్యాలు నెరవేరటం లేదని, నిరుద్యోగ యవత ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయని… జాతీయ పార్టీతోనే అన్ని నెరవేరుతాయన్న ఉద్దేశంతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.