రెండేళ్ళ నుంచి జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు సరికొత్త భయాలను సృష్టిస్తుంది. కోవిడ్ సోకిన వారిలో దాదాపు 23 శాతం మందికి లక్షణాలు చాలా కాలం పాటు ఉంటున్నాయని వైద్యులు అంటున్నారు. నెలల తరబడి బలహీనపరిచే లక్షణాలు ఉంటున్నాయని అధ్యయనంలో బయటపడింది. ఇన్ఫెక్షన్ సమయంలో ఊబకాయం మరియు జుట్టు రాలడం వంటి లక్షణాలు ఉంటె మాత్రం దీర్ఘకాల కోవిడ్ ఉన్నట్టే అని అధ్యయనంలో వెల్లడి అయింది.
Also Read:అంగారకుడిపై న్యూడిల్ లాంటి పదార్థం… నాసా చిత్రాలు వైరల్
మధుమేహం లేదా ధూమపాన అలవాటు వంటి సమస్యలు ఉంటే మాత్రం పరిస్థితి ఏంటీ అనేది చెప్పలేదు. సదరన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఈ పరిశోధన జరిగింది. మిలియన్ల మంది ప్రజలు ఈ సమస్యలతో బాధ పడుతున్నారని పరిశోధనలో వెల్లడి అయింది. కరోనా అనేది చాలా మందికి సాధారణంగా మూడు వారాల పాటు ఉండే తీవ్రమైన అనారోగ్యం అని మాత్రమే అనుకున్నారు ఇప్పటి వరకు.
12 వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండే లక్షణాలను దీర్ఘ కాల కోవిడ్ పరిగణించారు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 23 శాతం మంది తలనొప్పితో బాధ పడుతున్నారని వెల్లడి అయింది. ముక్కు కారడం లేదా మూసుకుపోవడం వంటి లక్షణాలను 19 శాతం అనుభవిస్తున్నారని… ఊపిరి తిత్తుల్లో అసౌకర్యంగా ఉందని 18 శాతం మంది చెప్పారని పేర్కొన్నారు. ఇక అలసటతి 17 శాతం మంది సఫర్ అవుతున్నారు. ఇక అతిసారంతో 13 శాతం మంది బాధ పడుతున్నారు. కరోనా వచ్చినప్పుడు ఊబకాయం ఎక్కువగా ఉన్న వాళ్లకు సమస్యలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడి అయింది.
Also Read:మెగా బ్రదర్స్ పై రెచ్చిపోయిన నారాయణ