పా.. పా.. పాము ! - Tolivelugu

పా.. పా.. పాము !

మనిషి కంటే ఎత్తుగా ఉన్న నాగుపాము తిరుమల నడక మార్గంలో కలకలం రేపింది. అటవీ సిబ్బంది దాన్ని చాకచక్యంగా పట్టుకుని దూరంగా అడవిలోకి వదిలిపెట్టారు. పాము వల్ల ఎవ్వరికీ ఏ ప్రమాదమూ జరగలేదు. ఇంతపెద్ద పామును ఇప్పటి వరకు చూడలేదని అక్కడ వున్న షాపుల వాళ్లు చెబుతున్నారు.

, పా.. పా.. పాము !పై ఫోటోలో కనిపిస్తున్న పాము పది అడుగుల పైనే వుంటుంది. తిరుమల కొండపై ఈ సర్పరాజం కాసేపు అక్కడున్న వారిని హడలెత్తించంది. శనివారం అలిపిరి-తిరుమల నడకమార్గంలో వెళ్తున్న భక్తులకు ఈ భారీ నాగు పాము కనిపించింది. అంతెత్తున ఉన్న ఈ పామును చూసి షాకయ్యారు. పడగ విప్పి బుసలుకొడుతూ పాము ఓ షాపులోకి దూరింది. వెంటనే ఆ దుకాణం యజమాని టీటీడీ అటవీశాఖ ఉద్యోగికి సమాచారం అందించారు. వారొచ్చి పామును పట్టుకుని తీసుకువెళ్లి అడవిలో విడిచిపెట్టారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp