కొరటాల శివ తన సినిమాల్లో పవర్ ఫుల్ క్యారెక్టర్ రోల్స్ కోసం పెద్ద స్టార్స్ ని ఎంపిక చేస్తుంటాడు. మిర్చి కోసం సత్యరాజ్‌ని, జనతా గ్యారేజ్‌కి మోహన్‌లాల్‌ని, ఆచార్య కోసం రామ్‌చరణ్‌ని కూడా తీసుకొచ్చాడు.
ఇప్పుడు ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నాడు కొరటాల. ఈ సినిమా కోసం కూడా ఓ పెద్ద స్టార్ ను తీసుకొచ్చే పనిలో ఉన్నాడు. ఇన్‌సైడ్ సోర్సెస్ ప్రకారం తమిళం లేదా బాలీవుడ్ ఇండస్ట్రీల నుండి ఓ టాప్ స్టార్‌ని తీసుకురావాలనేది కొరటాల ప్లాన్ గా కనిపిస్తోంది.
కోలీవుడ్ నుంచి విక్రమ్ ను తీసుకురావాలనేది కొరటాల మొదటి ఆలోచన. అయితే విక్రమ్, స్పెషల్ రోల్స్ చేస్తాడా చేయడా అనేది అందరి అనుమానం. ఒకవేళ విక్రమ్ తిరస్కరిస్తే.. బాలీవుడ్ నుంచి సైఫ్ అలీ ఖాన్‌ను తీసుకురావాలని చూస్తున్నారు.
స్పెషల్ రోల్స్ చేయడానికి సైఫ్ ఎప్పుడూ సిద్ధమే. ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ లో విలన్ గా నటించాడు సైఫ్. సో.. ఎన్టీఆర్ ప్రాజెక్టు, తెలుగులో సైఫ్ కు రెండోది అవుతుంది.
ఇక షూటింగ్ అప్ డేట్స్ విషయానికొస్తే.. ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లాలంటే ఎన్టీఆర్ నవంబర్‌లోగా కొరటాల సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. అందుకు తగ్గట్టుగా మార్చి నాటికి పూజా కార్యక్రమాలు పూర్తి చేసి సెట్స్‌పైకి వెళ్తారని తెలుస్తోంది.