రాక్ స్టార్ యష్ హీరో గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా కేజీఎఫ్. ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రికార్డుల మోత మోగించింది. కలెక్షన్ల పరంగా కూడా మంచి వసూళ్లనే రాబట్టింది. అయితే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కే జి ఎఫ్ కు సీక్వెల్ గా చాప్టర్ 2ను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల షూటింగ్ లకు అనుమతులు రావడంతో షూటింగ్ ను ప్రారంభించి శరవేగంగా పూర్తి చేస్తున్నారు.
అయితే కేజిఎఫ్ సినిమా నుంచి ఓ ట్రీట్ ను చిత్ర యూనిట్ సిద్ధం చేసిందట. ఈనెల 21న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ఆ ట్రీట్ మీకు అందుతుంది. ఇన్ని రోజులు ఎదురుచూసినందుకు కృతజ్ఞతలు అంటూ ఓ ప్రకటన ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. అయితే ఆ ప్రకటన రిలీజ్ డేట్ కు సంబంధించినదా లేక ట్రైలర్ కు లేక ట్రైలర్ రిలీజ్ కు సంబంధించినదా అంటూ సినీ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.