బిగ్ బాస్ బుల్లితెర రియాలిటీ షో కు మంచి ఆదరణ లభిస్తుంది. హిందీ, తెలుగు, కన్నడ తో పాటు తమిళనాట కూడా బిగ్ బాస్ కు మంచి క్రేజ్ ఉంది. అయితే ఇప్పుడు తమిళనాట ఓటిటి వెర్షన్ బిగ్ బాస్ అల్టిమేట్ పేరుతో టెలికాస్ట్ కాబోతుంది.
ఈ షో కు హోస్ట్ గా శింబు ని తీసుకొచ్చారు నిర్వాహకులు. ఇదే విషయాన్ని తెలుపుతూ… ఓ ప్రోమోను రిలీజ్ చేసింది. ఈ ప్రోమో లో శింబు కొత్తగా కనిపించాడు.
మీరు నన్ను ఊహించలేదు, అవునా? నేను కూడా ! మనం మొదలు పెడదామ? అంటూ చెప్పుకొచ్చారు శింబు. నిజానికి ఈ షో కు కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరించాల్సి ఉంది.
కానీ విక్రమ్, ఇండియన్ 2 పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నందున తప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త హోస్ట్‌గా శింబు ను తీసుకువచ్చారు. మరి శింబు హోస్ట్ గా ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.