బిగ్ బాస్ సీజన్ 4 కోసం బుల్లితెర ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. లాక్ డౌన్ సడలింపుల తర్వాత షూటింగ్స్ ప్రారంభం అయినప్పటికి సీరియల్ యాక్టర్స్ ఒక్కొక్కరూ కరోనా బారిన పడడంతో షూటింగ్స్ నిలిచిపోతాయేమో..ఇక ఈ ఏడాది బిగ్ బాస్ కూడా రాదేమో అని బాధపడ్డారు..కానీ ప్రోమో రిలీజ్ చేసి ప్రేక్షకులను తన వైపుకి తిప్పుకుంది మా టివి.. అయినప్పటికి ఎన్నో తర్జన భర్జనల మధ్య లేటెస్ట్ ప్రోమో షూట్ జరిపింది.
కరోనాకి దూరంగా బిగ్ బాస్ నిర్వహించబోతున్నారని సమాచారం.అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడపడితే అక్కడే కేసులు పెరిగిపోతుంటే అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా.. కోవిడ్ కారణంగా బిగ్ బాస్ తీస్కుంటున్న జాగ్రత్తలు,మార్పులు మీరే చదవండి..
- బిగ్ బాస్ హౌజ్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎంపిక జరిగిపోయింది..వారిని మూడు వారాల ముందు నుండే ఎవరిని కలవకుండా హోం క్వారంటైన్లో ఉండమన్నారట.. వాళ్లందరికి ఇప్పటికే రెండుసార్లు కరోనా టెస్టులు కూడా నిర్వహించినట్టు సమాచారం..
- బిగ్ బాస్ ప్రోగ్రాంకి వర్క్ చేసే ప్రతి ఒక్కరికి అకామిడేషన్ వాళ్లే కల్పించారు.. ఏ ఒక్కరూ కూడా ఆ అకామిడేషన్ దాటి బయటకు వెళ్లకుండా, బయటవాళ్లని కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు..
- ప్రోగ్రామ్ కి వర్క్ చేసే వర్కర్స్ ప్రతి ఒక్కరికి పిపిఇ కిట్లు అందచేశారు.. ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు వారంతా పూర్తిగా ఆ ప్రాంతానికే పరిమితం అయ్యేలా సూచించారట..అలా డెడికేటెడ్ గా ఉండేవాళ్లని మాత్రమే ప్రోగ్రామ్ కి వర్క్ చేయడానికి తీసుకున్నట్టు సమాచారం.
- హౌజ్ ని , ప్రస్తుతం కంటెస్టంట్స్ క్వారంటైన్లో ఉన్న ప్రాంతాల్ని పూర్తిగా శానిటైజ్ చేసారు..గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రత్యేక వైధ్యసదుపాయాలు కల్పించారు..షోలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కల్పించినట్టు సమాచారం.
- ఇక షో లో నాగార్జున హోస్ట్ గా కన్ఫామ్ అయిపోయింది.. నాగార్జున అసిస్టెంట్స్ అందరికి పిపిఇ కిట్స్ అందించారట..
- ఇకపోతే ఈ సారి హౌజ్ లో ఉండే కంటెస్టంట్స్ తక్కువే, షో రోజులు తక్కువే..దాంతో పాటు టాస్క్ లు కూడా చాలా పక్కా పకడ్బందిగా ప్లాన్ చేశారు.. హౌజ్ లో వాళ్లు ఫిజికల్ డిస్టెన్స్ పాటించాల్సిందే.. టాస్కులు కూడా శారిరక బలానికి కాకుండా, మెదడుకు మేత లాంటివి ప్రిపేర్ చేస్తున్నారట..
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బిగ జాగ్రత్తలతో ,ఇంత భారిగా ఖర్చుపెట్టి నిర్వహించబోతున్న షో పట్ల ఆసక్తి రోజురోజుకి పెరిగిపోతుంది..ఇంతమందితో ధైర్యంగా షో నిర్వహించడానికి ముందుకు వచ్చిన నిర్వాహకులు,పార్టిసిపెంట్స్ ,వర్కర్స్ ధైర్యానికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. షో ఎలా ఉంటుంది ఏంటి అనే దానితో సంబంధం లేకుండా ఈ సారి బిగ్ బాస్ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని అంచనా వేస్తున్నారు.