బిగ్ బాస్ 3 రియాలిటీషో… 13 వారాలకు గడుస్తుంది. సుమారు మూడు నెలలుగా కుటుంబాలకు దూరంగా ఉన్న హౌస్ మేట్స్ కి బిగ్ బాస్ కొంత భాదని తగ్గిస్తున్నాడనే చెప్పాలి. హౌస్ లోపలికి వాళ్ళ కుటుంబ సభ్యులను పంపుతున్నాడు. మొదట వితిక చెల్లి ఇంట్లోకి అడుగుపెట్టగా.. ఆ తర్వాత అలీ రెజా భార్య, శివజ్యోతి భర్త, బాబా భాస్కర్ భార్యా పిల్లలు హౌస్‌లోకి ఒక్కొక్కరుగా వెళ్లారు. తమ వారితో కాసేపు ముచ్చటించి గేమ్‌పై సలహాలు సూచనలు ఇస్తున్నారు.
గురువారం ఎపిసోడ్‌లో వరుణ్ బామ్మ, శ్రీముఖి తల్లి ఇంట్లోకి వస్తారు. అయితే బిగ్ బాస్ శ్రీముఖికి షాక్ ఇచ్చినట్టు ఆ ప్రోమో లో తెలుస్తుంది. శ్రీముఖి తల్లి.. పాపా అంటూ శ్రీముఖిని పిలుస్తుంది. వెంటనే శ్రీముఖి పరుగులు పెడుతుంది. ఈ లోపు పవర్ సేవ్ మోడ్‌లోకి వెళ్లాలని బిగ్‌బాస్ ఆదేశించడంతో శ్రీముఖి డోర్ దగ్గరే నిలిచిపోతుంది. ఇక వచ్చిన దారిగుండా వెళ్లిపోవాలని శ్రీముఖి తల్లికి బిగ్ బాస్ సూచిస్తాడు. బిగ్ బాస్ ఆదేశం మేరకు లత ఇంటి నుంచి వెళ్లిపోతున్న తరుణంలో శ్రీముఖి వెక్కి వెక్కి ఏడుస్తుంది.
అస్సలు ఏమి జరిగిందో తెలుసుకోవాలంటే ఎపిసోడ్ మొత్తం చూడాల్సిందే…