105 రోజులుగా ప్రసారమైన బిగ్ బాస్ 4 ముగిసింది. అభిజిత్ విన్నర్ గా, అఖిల్ రన్నర్ గా , సోహెల్ స్మార్ట్ మూవర్ గా నిలిచారు. ఈక్రమంలో బిగ్ బాస్ 4 లో టాప్ 5 లో నిలిచిన అభిజిత్, అఖిల్ , సోహెల్, అరియానా, హారికలకు ఫైనల్ గా ఎంత అమౌంట్ వచ్చిందో ఇప్పుడు చూద్దాం!
అభిజిత్:
బిగ్ బాస్ హౌస్ లో 14 వారాల జర్నీ చేసినందుకు గాను అభిజిత్ కు రెమ్యునరేషన్ కింద దాదాపు 42 లక్షలు అందినట్టు సమాచారం, విన్నర్ అయినందుకు 25 లక్షలు, అపాచీ బైక్ కాస్ట్ 2.5 లక్షలుగా లెక్కిస్తే….టోటల్ బిగ్ బాస్ పేరు మీద అభికి దక్కిన మొత్తం అమౌంట్ 70 లక్షలు
అఖిల్ :
బిగ్ బాస్ 4లో రన్నర్ గా నిలిచిన అఖిల్ కు రెమ్యునరేషన్ గా 26 లక్షలు లభించాయి.
సోహెల్ :
తెలుగు బిగ్ బాస్ చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరతీసిన సోహెల్ కు 14 వారాల పాటు హౌస్ లో ఉన్నందుకు రెమ్యునరేషన్ కింద 26 లక్షలు, ఫైనల్ రేస్ నుండి క్విట్ అయినందుకు 25 లక్షలు అందుకున్నాడు …అంటే బిగ్ బాస్ పేరుమీద సోహెల్ కు అందిన మొత్తం 51 లక్షలు.
అరియానా:
అనామకురాలిగా హౌస్ లో అడుగుపెట్టిన ఆరియానా….. మంచి ఫ్యాన్ బేస్ తో పాటు రెమ్యునరేషన్ కింద 21 లక్షల వరకు సంపాదించింది.
హారిక:
దేత్తడి హారిక కూడా 14 వారాల పాటు హౌస్ లో ఉన్నందుకు రెమ్యునరేషన్ కింద ఆమెకు 42 లక్షల వరకు అందాయట!
మోనల్ :
ఇక 13 వ వారంలో ఎలిమినేట్ అయిన మోనల్ కు దాదాపు 50 లక్షల దాకా అందినట్టు సమాచారం!