తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి బుల్లితెర మీద కనిపిస్తూ హడావిడి చేసిన షో బిగ్ బాస్.ప్రస్తుతం నాలుగో సీజన్ లోకి అడుగుపెట్టింది.ఇక ఈ సీజన్ లో ప్రస్తుతానికి 16మంది కంటెస్టెంట్ లు బిగ్ బాస్ హౌస్ లో హడావిడి చేస్తున్నారు.పాపం ఇంట్లోకి అడుగుపెట్టి కనీసం రెండు రోజులు కూడా పూర్తవక ముందే బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేసేసారు. అందులో భాగంగా ఈవారం ఏడుగురు కంటెస్టెంట్ లు ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు.
కరోనా టైం కావడంతో జనాలు వీలైనంత వరకు ఇంట్లో ఉండడానికి వర్క్ ఫ్రం హోం లు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.మరి ఇలాంటి టైంలో బిగ్ బాస్ మొదలు కావడంతో ఈ సీజన్ రేటింగ్ లు రికార్డులు సృష్టిస్తాయని అందరూ భావిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో గత బిగ్ బాస్ రేటింగ్స్ గురించి వాటి డీటైల్స్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతుంది.
గతంలో బిగ్ బాస్ సీజన్ 1 షో ఓపెనింగ్ 16.18
రెండో సీజన్ తొలిరోజు 15.05
మూడో సీజన్లో తొలిరోజు 17.9 రేటింగ్స్ వచ్చాయి.
ఈసారి మరోమారు బిగ్ బాస్ సీజన్ 4కు హోస్ట్ గా అక్కినేని నాగార్జున వ్యవహరించడం విశేషం. మరి ఈ సీజన్ కు మొదటిరోజు ఎంత రేటింగ్స్ వచ్చాయో అనేది తెలియడం కోసం ఈవారం చివరివరకు ఆగాల్సి ఉంటుంది.మరి అభిమానుల ఎక్స్ పెక్టేషన్స్ ను ఈసారి బిగ్ బాస్ రీచ్ అవుతుందో లేదో వేచి చూడాలి.