తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు, అన్నా డీఎంకే బహిషృత నేత శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.ఈ మేరకు ఓ లేఖ రాశారు. ఇటీవలే జనవరిలో జైలు నుంచి విడుదలైన శశికళ తమిళ రాజకీయాల్లో క్రీయాశీలకపాత్ర పోషిస్తారని.. అన్నా డీఎంకేతో కలిసిపోతారని జోరుగా ప్రచారం సాగుతున్న సమయంలో.. ప్రజా జీవితం నుంచి నిష్క్రమిస్తున్నట్టు ఆమె ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. జయలలిత ఉన్నప్పుడు ఏ పదవీ చేపట్టాలని నేను అనుకోలేదు. ఆమె మరణానంతరం కూడా అలాగే కొనసాగాలనుకున్నా. రాజకీయాలు, ప్రజా జీవితం నుంచి తప్పుకుంటున్న.. ఏఐడీఎంకే పార్టీ గెలవాలి. జయలలిత వారసత్వం కొనసాగాలి. డీఎంకే పార్టీని ఓడించాలని ఏఐఏడీఎంకే కార్యకర్తలను కోరుతున్నా అంటూ లేఖలో శశికళ చెప్పుకొచ్చారు