నాలుగు సీజన్లను దిగ్విజయంగా ముగించుకొని ప్రేక్షకుల ఆదరణ పొందిన బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్. అయితే బిగ్ బాస్ సీజన్ ఫోర్ తో ఎంతో మంది ప్రేక్షకుల మన్ననలను పొందాడు నటుడు సొహైల్. తాజాగా సొహైల్ మెగాస్టార్ ని కలిశారు. రెండు రోజుల క్రితం కింగ్ నాగార్జున ను కలిసిన సొహైల్ తాజాగా చిరంజీవి ఇంటికి వెళ్లారు. రెండు గంటలపాటు అక్కడే ఉన్నారు.
చిరంజీవి భార్య సురేఖ ,తల్లి అంజనా దేవి తో కలిసి ఫోటోలు దిగారు. అందుకు సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో సొహైల్ పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.