బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 విన్నర్‌గా అభిజిత్ నిలిచిన విషయం విదితమే. ఇటీవలే ఆ షో ముగియగా మెగాస్టార్ చిరంజీవి ఫినాలెకు ముఖ్య అతిథిగా హాజరై విన్నర్, రన్నర్ అప్‌లకు బహుమతులను అందజేశారు. అలాగే అందరితోనూ సరదాగా గడిపారు. అయితే విన్నర్ కాలేకపోయినప్పటికీ 2వ స్థానంలో నిలిచిన అఖిల్ కూడా ఆ స్థానంలో వచ్చినందుకు సంతోషంగానే ఉన్నాడు.
కానీ అభిజిత్‌ను విన్నర్‌గా అనౌన్స్ చేసే సమయంలో నాగార్జున ప్రవర్తించిన తీరుపై ఇప్పుడు అందరూ విమర్శిస్తున్నారు. అభిజిత్ విన్నర్ అంటూ అనౌన్స్ చేస్తూ అతని చేయిని పైకెత్తిన నాగార్జున అఖిల్ చేతిని సాధారణంగా విడిచిపెడితే సరిపోయేది. కానీ వెనక్కి తోసేసినట్లు, విదిలించుకున్నట్లు అఖిల్ చేతిని విసిరేశాడు. దీంతో అఖిల్ పట్ల నాగార్జున ప్రవర్తించిన తీరుకు అఖిల్ తల్లి స్పందించారు.
విన్నర్‌ను అనౌన్స్ చేసే సమయంలో అఖిల్ పట్ల నాగార్జున అలా ప్రవర్తించి ఉండకూడదని, అఖిల్ చేతిని విసిరేయాల్సిన అవసరం లేదని, ఆ విషయం తనకు మంచిగా అనిపించలేదని, సీజన్ మొత్తం ఎంతో ఉత్సాహంగా సాగినా ఆ ఒక్క సంఘటన తనను ఎంతగానో బాధకు గురి చేసిందని అఖిల్ తల్లి పేర్కొన్నారు. అయితే నాగార్జున అలా ప్రవర్తించే సరికి అఖిల్ ముఖంలో కూడా స్టేజిపై ఒక్కసారిగా రియాక్షన్ మారింది. కానీ అతను అంతలోనే తేరుకుని ఆ విషయాన్ని అప్పటికి మరిచిపోయాడు. ఫినాలె వేడుకల్లో ఉత్సాహంగానే పాల్గొన్నాడు.
కానీ విన్నర్‌ను ప్రకటించే సందర్భంలో నాగార్జున అలా ప్రవర్తించడంపై పలువురు విమర్శిస్తున్నారు. అయితే అభిజిత్, అఖిల్ ఇద్దరు విన్నర్, రన్నరప్‌గా నిలిచినందుకు సంతోషంగా ఉందని అఖిల్ తల్లి అన్నారు. కాగా gv అంత మొత్తాన్ని తీసుకుని చివరి నిమిషంలో తప్పుకోవడంపై ఆమె స్పందించలేదు. అది అతని నిర్ణయమని, షోలో భాగమని అంతకు మించి దాని గురించి మాట్లాడాల్సిన పనిలేదని అన్నారు. అయితే ఇంకో ప్రత్యేక వీడియోలో అఖిల్ తనపై వస్తున్న ట్రోల్స్‌కు స్పందించాడు. తాను విమర్శలను పట్టించుకోనని, ఎన్నో వేల మంది తనను విన్నర్ అని పిలుస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నాడు.