మూడు సీజన్లను దిగ్విజయంగా కంప్లీట్ చేసుకున్న నాల్గవ సీజన్ లోకి అడుగుపెడుతున్న బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్. కరోనా కారణంగా షో నిర్వహిస్తారా లేదా అనే సందేహాలు వస్తున్న సమయంలో వాటన్నింటిని తుడిచిపెడుతూ సీజన్ 4 కి సంబంధించి ప్రోమోని విడుదల చేశారు.
గత సీజన్ కు హోస్ట్ గా ఉన్న నాగార్జుననే ఈ ఏడాది కూడా హోస్ట్ గా తీసుకున్నారు. అయితే ఈ షో లేట్ గా మొదలైనా లేటెస్ట్ గా ఉండేలా యాజమాన్యం ప్లాన్ చేస్తున్నారట. రీసెంట్ గా ఈ షో ప్రోమో కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు బిగ్ బాస్ సీజన్ 4 ను ఆగష్టు 30 నుంచి టెలికాస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు సంబంధించి సన్నాహాలు ఇప్పుడు జరుగుతున్నట్టు సమాచారం.