బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 4 తో ప్రేక్షకులకు దగ్గరైంది అరియానా. అంతకు ముందు వరకు ఈ అమ్మడు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. అంతేకాకుండా రాంగోపాల్ వర్మ తో చేసిన ఇంటర్వ్యూ కారణంగానే అరియానా ఫేమస్ అయింది. ఆర్జీవి కూడా ఆమె కు అభిమానిని అంటు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. గతంలో కూడా వర్మ అరియానా కు ఓటేయమని సోషల్ మీడియాలో మద్దతు తెలిపాడు.
అయితే ప్రస్తుతం శ్రీముఖి, విష్ణుప్రియ, అరియానా లు గోవాలో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ ఎంజాయ్ చేస్తూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆర్జీవి ని తన కార్యాలయంలో అరియానా కలిశారు. అందుకు సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. తన కోసం సమయం కేటాయించినందుకు ఆర్టీవికి కృతజ్ఞతలు అంటూ అరియానా రాసుకొచ్చింది.
Finally, I met my fav person @RGVzoomin sir #goa pic.twitter.com/xYivJdIowW
— ariyana (@ariyanaglory) February 6, 2021