శ్రీముఖి రీఎంట్రీ... ఏ ఛానల్‌లో అంటే...? - Tolivelugu

శ్రీముఖి రీఎంట్రీ… ఏ ఛానల్‌లో అంటే…?

bigg boss runner up sreemukhi re entry confirms in star maa with new program, శ్రీముఖి రీఎంట్రీ… ఏ ఛానల్‌లో అంటే…?

 

బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకున్న శ్రీముఖి బిగ్‌బాస్‌ హౌజ్‌కు వెళ్లటంతో స్క్రీన్‌ మీద కనపడటమే మానేసింది. బిగ్ బాస్ పూర్తయ్యింది కదా ఇక మళ్లీ ఎప్పుడు కనిపిస్తావ్ అంటూ శ్రీముఖిని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

బిగ్‌బాస్ ఫేవరేట్‌లలో ఒకరిగా ఉండి… టైటిల్‌ కోసం చివరి వరకు పోరాడిన శ్రీముఖి… టైటిల్ గెలవకున్నా ప్రేక్షకుల అభిమానం పొందిన పేరుంది. దీంతో… ఆమె సక్సెస్ ఎంజాయ్ చేస్తూ… తన ఫ్రెండ్స్‌తో టూర్స్‌ వేసి వచ్చింది.

అయితే, అభిమానుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన శ్రీముఖి… ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతోందని, అతి త్వరలోనే మీ ముందుకు రాబోతున్నట్లు ప్రకటించింది. అయితే ఏ ఛానల్‌లో రాబోతుందో మాత్రం సస్పెన్స్‌గా ఉంచేసింది.

అయితే, శ్రీముఖి తన కొత్త ప్రయాణం స్టార్‌మాతోనే కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ క్రేజ్‌ను, శ్రీముఖి అభిమానులను క్యాష్ చేసుకునేందుకు శ్రీముఖి కోసం ప్రత్యేకంగా ఓ షోను మొదలుపెట్టిందట. అతి త్వరలోనే ఆ షో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు బుల్లితెర వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp