అషురెడ్డి, పునర్నవీ పిచ్చెక్కించే స్కిన్ షో.. పులిహోరా రాజా రాహుల్ భాయ్ నెర్వస్‌నెస్… అందరూ భయపడేలా హిమజా సింగింగ్.. కన్నీళ్లు పెట్టించడం కోసం వితిక చేసిన బ్లైండ్ యాక్టింగ్.. అమ్మాయిల్ని మెప్పించేందుకు అలీ రెజీ సిక్స్ ప్యాక్ సెక్సప్పీల్..
ఇదంతా ఎప్పుడు జరిగింది.. ఎక్కడ జరిగిందని అంటారా..?
బిగ్‌బాస్ హౌసులో లగ్జరీ బడ్జెట్ కోసం కంటెస్టెంట్లు చేసిన ఓవరాక్టింగ్.. మేటరేంటంటే..
బిగ్‌బాస్ బుధవారం ఎపిసోడ్‌లో టాలెంట్ షో జరిగింది. బాబా భాస్కర్, శ్రీముఖిలను జడ్జిలుగా పెట్టారు. మిగిలిన హౌస్మేట్స్ అందరూ డాన్సింగులు, యాక్టింగులు.. పెర్ఫార్మన్స్‌తో నిజంగా పిచ్చే ఎక్కించారు. ‘పిలగాడా.. ఇరగ ఇరగ ఇరగ’ సాంగ్‌తో పునర్నవి ఇరగదీసింది.
జూనియర్ సమంతాగా సోషల్ మీడియాలో పాపులర్ అయిన అషురెడ్డీ ‘జిల్ జిల్ జిల్ జిగేలు రాజా’ అంటూ అదిరిపోయే డాన్స్ చేసింది. హీరోయిన్ వితికా షెరూ కళ్లు లేని అమ్మాయిలా నటించింది. హిమజ.. ఓ సక్కనోడా అనే పాట వంద తప్పులతో ఎంతో కష్టపడి పాడింది. ఇదంతా లగ్జరీ బడ్జెట్ టాస్క్ కింద జరిగిన పెర్ఫామెన్స్ షో. ఈ షోలో కంటెస్టెంట్స్ అందరూ టాలెంట్ ప్రూవ్ చేసుకునేందుకు తంటాలు పడ్డారు.
బిగ్‌బాస్ షో స్టార్ మా టెలివిజన్‌లో ఏదో ఇలా అప్పుడప్పుడు కాస్త ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తూ మొత్తం మీద భారంగా సాగుతోంది.
సగం మీసం తీసేసిన బుల్లితెర హీరో రవి కృష్ణ ఒకవైపు అమ్మాయిగా, మరోవైపు అబ్బాయిగా కనిపిస్తూ డ్యాన్స్ చేశాడు. అలీరెజా ‘స్వింగ్‌జరా’ సాంగుకి సిక్స్ ప్యాక్ చూపిస్తూ స్టెప్స్ వేశాడు.
స్మిమ్మింగ్ పూల్‌లో దూకి తడిసిన బాడీతో వచ్చి హాట్ హాట్ డ్యాన్స్ చేశాడు. అన్నట్టు అలీ డాన్స్‌కి శ్రీముఖి ఫిదా అయ్యింది.