స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని నాగచైతన్య విడాకుల వివాదం ఎంత చర్చనీయాంశంగా మారిందో చెప్పాల్సిన పని లేదు. అయితే ఆ తర్వాత సమంత వాటన్నింటినీ పక్కన పెట్టి వరుస సినిమాలను చేస్తూ ముందుకు పోతోంది. అలాగే నాగచైతన్య కూడా తన పని తాను చేసుకుంటున్నాడు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త సమంత నాగచైతన్య గురించి వస్తూనే ఉంది.
అయితే తాజాగా సమంత పెట్టిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత కామెంట్ ఎవరికోసం అంటూ చర్చ కూడా నడుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే బిగ్ బాస్ రియాలిటీ షో స్టార్ట్ అయ్యాక మొదటి సీజన్ కు ఎన్టీఆర్, ఆ తరువాత నాని హోస్ట్ గా వ్యవహరించారు. మూడవ సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
ఆచార్య లో చిరంజీవి పక్కన నటించిన ఘట్టమ్మ బ్యాక్ బ్యాక్ గ్రౌండ్ తెలుసా
బిగ్ బాస్ ఓటిటికి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. అయితే ఇప్పుడు నాగార్జున వ్యవహారశైలి సినీ ప్రేక్షకులకి అంతగా నచ్చడం లేదు. గతంలో ఉన్న జోష్ ఉత్సాహం కనిపించట్లేదు. దీంతో బిగ్ బాస్6 కి నాగర్జున హోస్ట్ గా ఉండకపోవచ్చని సమాచారం. అయితే వచ్చే సీజన్ కు నాగార్జునకు బదులుగా సమంతను హోస్ట్ గా తీసుకురావాలని బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట.
ఎన్టీఆర్ కట్టించిన థియేటర్లు ఎందుకు మూతపడ్డాయో తెలుసా ?
అందుకే సమంత ఇంస్టాగ్రామ్ ఖాతాలో కమింగ్ సూన్ అనే పోస్ట్ పెట్టిందని తెలుస్తోంది. అయితే దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందట. నాగార్జున హోస్ట్ గా వచ్చినప్పుడు మొదట్లో రేటింగ్ పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ క్రమేణా తగ్గుతూ వచ్చింది. బిగ్ బాస్ 6కి కూడా నాగార్జున హోస్ట్ గా కొనసాగితే రేటింగ్స్ మరింత పడిపోయే ప్రమాదం ఉందని అందుకే నిర్వాహకులు సమంతను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట.
ఆర్ఆర్ఆర్ లో Jr. ఎన్టీఆర్ పట్టుకున్న జెండా చరిత్ర తెలుసా?
ఇక సమంత కూడా గతంలో నాగార్జున లేనప్పుడు బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంది. కాబట్టి ఇప్పుడు సమంత హోస్ట్ గా వస్తే షో కు కొత్త గ్లామర్ వస్తుందని రేటింగ్ కూడా పెరిగే అవకాశం ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారట.కాగా ఇదే విషయమై కొంత మంది నెటిజన్స్ నాగార్జున ను సమంత ఇన్ డైరెక్ట్ గా దెబ్బ కొట్టింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.