తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 4 విన్నర్ ఎవరో తేలిపోయింది. 105 రోజుల పాటు ఆద్యంతం ఆసక్తిగా సాగిన షోలో అందరూ ఊహించినట్టే అభిజిత్ టైటిల్‌ను గెలుచుకున్నారు. 15 వారాలుగా సాగుతన్న ఉత్కంఠకు తెరదించుతూ.. గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా హాజరైన మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో షో హోస్ట్ నాగార్జున విన్నర్‌ను ప్రకటించారు. రన్నరప్‌గా టాప్ 2 స్థానంలో అఖిల్ నిలిచారు.దానికి ముందు టాప్ 3 కంటెస్టెంట్స్‌గా ఉన్న అభిజిత్, అఖిల్, సొహైల్ ముగ్గురిలో.. సోహైల్ నాగ్ ఇచ్చిన రూ. 25 లక్షల ఆఫర్‌ను ఎంపిక చేసుకొని బయటికి వచ్చేశాడు
గ్రాండ్ ఫినాలేలో టాప్ 5 నుంచి ముందు అమ్మాయిలే బయటికి వెళ్లిపోయారు. హారిక, అరియానా ఇద్దరూ ముందుగానే ఎలిమినేట్ అయ్యారు.వాస్తవానికి అరియానా కనీసం రన్నరప్ అయినా అవుతుందని అంచచా వేశారు. కానీ అలా జరగలేదు.
మరోవైపు గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. మెగాస్టార్ రాకతో.. మెగా ఈవెంట్‌గా మారిపోయింది. చిరు. నాగ్ నవ్వుతూ, నవ్విస్తూ బిగ్‌బాస్ సీజన్ 4 ఫైనల్ ఎపిసోడ్‌ని హ్యాపీగా ముగించారు.
గత విజేతలని వివరాలను చూస్తే.. సీజన్ 1 విన్నర్‌గా శివ బాలాజీ నిలవగా.. సీజన్ 2లో కౌశల్.. సీజన్ 3 రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ గెలుచుకున్నారు.