బిగ్‌బాస్ హౌజ్‌లో రాహుల్-పున్నరవి సందడి అంతా ఇంతా కాదు. వీరిద్దరి మధ్య ఎదో ఉందని, సీక్రెట్ లవ్ అంటూ బిగ్ బాస్ ప్రేక్షకులు ప్రచారం చేశారు. అందుకు రాహుల్-పునర్నవిలు కూడా నిజమే అన్నట్లుగా బీహేవ్ చేయటం కూడా ఓ కారణం.
అయితే, బిగ్‌బాస్‌లో రాహుల్ విన్నర్‌గా నిలవటం… రాహుల్-పునర్నవిలు రెగ్యూలర్‌గా కలవటంతో పాటు వాళ్లిద్దరికీ ఇష్టమైతే పెళ్లిచేయడానికి మేము రెడీ అంటూ రాహుల్ తల్లి ప్రకటన ఇవ్వటంతో ఖచ్చితంగా ప్రేమ ఉండే ఉంటుంది… నిప్పులేనిదే పొగ రాదు కదా అని అంతా అనుకున్నారు.
అయితే, ఈ జంట మరోసారి ఆన్ స్క్రీన్‌పై కనపడనుంది. వచ్చే సోమవారం అలీ చేస్తున్న ఓ ప్రోగ్రాంలో జంటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
వీరి క్రేజీని వాడుకునేందుకు కొందరు దర్శక-నిర్మాతలు రాహుల్-పునర్నవి జంటగా సినిమా కూడా ప్లాన్ చేస్తున్నట్లు ఫిలింనగర్‌లో జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.