రాహుల్ సిప్లిగంజ్ , పునర్నవిల మధ్య ఏముంది..?వాలెంటైన్ డే సందర్బంగా వెళ్ళెక్కడ ఉన్నారు..?ఇంతకీ ప్రేమికుల రోజును ఇద్దరు సెలబ్రేట్ చేసుకున్నారా..? వంటి ప్రశ్నలతో పున్ను, రాహుల్ ఫ్యాన్స్ తెగ హైరానా పడిపోతున్నారు.
బిగ్ బాస్ తో పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్ లకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. హౌస్ లో వీరి మధ్య నడిచిన కెమిస్ట్రీ చూసి హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున కూడా వీరిని సరదాగా ఆటపట్టించేవాడు. రాహుల్, పున్ను జంట అద్భుతంగా ఉందంటూ సరదాగా వ్యాఖ్యానించేవాడు. ఇవ్వనీ బిగ్ బాస్ షోకు మరింత టీఆర్పీని పెంచడం కోసమే అనుకోవచ్చు. కానీ అప్పుడప్పుడు వారి మధ్య నిజంగానే లవ్ ట్రాక్ ఉందనేలా ఇద్దరి వ్యవహారశైలి ఉన్నదనేది ఆడియన్స్ మాట. రాహుల్ ఫేక్ ఎలిమినేషన్ సమయంలో పున్ను రాహుల్ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం… పున్నూ ఎలిమినేషన్ సమయంలో రాహుల్ భావోద్వేగానికి లోనైనా తీరుతో వీరిద్దరి మధ్యనున్నది ప్రేమేనని ఓ అంచనాకు వచ్చారు. రాహుల్ బిగ్ బాస్ విన్నర్ గా నిలువడంలో పునర్నవి పాత్ర కూడా ఉన్నది. అయితే వీరు బయటకు వచ్చాక తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని ఊహాగానాలకు తెరదించే ప్రయత్నం చేసినప్పటికి.. అభిమానులు మాత్రం ఇద్దరు ఒక్కటైతే చూడాలని ఉందంటున్నారు.
పైగా రాహుల్ పేరెంట్స్ కూడా పునర్నవి, రాహుల్ లు ఒకే అంటే పెళ్లి చేసేందుకు సిద్ధమేనని తెలిపారు. దాంతో ఫ్యాన్స్ కూడా తొందరగా ఆ పని చేయండి అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. శుక్రవారం ప్రేమికులు రోజు సందర్బంగా పునర్నవి, రాహుల్ లు కలిశారు. బయటకు వెళ్తే తప్పుగా అర్ధం చేసుకునే ప్రమాదముందని భావించి.. వరుణ్ సందేశ్ ఇంటికే వెళ్లారు. వితిక, పునర్నవి, వరుణ్ సందేశ్, రాహుల్ లు బాగానే సందడి చేసినట్లు కనబడుతోంది. ఈ సందర్భంగా నలుగురూ కలిసి దిగిన ఫొటోను వరుణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. ‘హ్యాపీ వ్యాలెంటైన్స్ డే ఫ్రం ది గ్యాంగ్’ అని క్యాప్షన్ తో ఫోటోను షేర్ చేశారు.ఈ ఫొటోలో పున్నూ ఫోనులో ఏదో చూపిస్తుంటే ఆ పక్కనే ఉన్న రాహుల్, వితిక, వరుణ్ నవ్వుతు కనిపించారు.
ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేమికుల రోజున పున్ను, రాహుల్ లు ఇద్దరు కలవడంతో అభిమానులు కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు. త్వరలోనే జంటగా కనిపించాలని కోరారు. మరి ఇద్దరు అభిమానుల కోరికను తీర్చుతారా..?లేక మొదటి నుంచి చెప్తున్నట్టుగానే ఫ్రెండ్స్ లాగానే ఉంటారా అనేది చూడాలి.
Advertisements