బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికే తెలుగులో నాలుగు సీజన్ లను పూర్తిచేసుకున్న ఈ షో ఇప్పుడు 5వ సీజన్ ను స్టార్ట్ చేయబోతోంది. ఇప్పటికే ఈ షో కి సంబంధించి ప్రోమో ను రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఇక గత సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించిన కింగ్ నాగార్జున ఈ సీజన్ కు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
అలాగే ఈసారి ఈ సీజన్ లో ఎంటర్టైన్మెంట్ ఐదింతలు ఉంటుందని చెబుతున్నారు నిర్వాహకులు. అలాగే సెట్ కూడా చాలా అందంగా ఉండనుందట. ప్రేక్షకులకు కిక్ కూడా టన్నుల్లో ఉంటుందని చెప్తున్నారు. కాగా కంటెస్టెంట్స్ ఎవరు, ఎపిసోడ్ లాంచింగ్ ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు వేచి చూడాల్సిందే. ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ షో స్టార్ట్ కానుంది.