రైల్వే బడ్జెట్‌కు అత్యంత ప్రాధాన్యత ఉందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. అందువల్ల రైల్వే బడ్జెట్ ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో రైల్వే బడ్జెట్ ను ప్రవేశ పెట్టేవారని, ఇప్పుడు కూడా అదే విధానాన్ని అనుసరించాలని ఆయన కోరారు.
గతంలో తాను రైల్వే మంత్రిగా పనిచేసిన సమయంలో కేంద్రం రైల్వే బడ్జెట్ ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టేదని తెలిపారు. ఆ బడ్జెట్ ద్వారా కేంద్రం ప్రజలకు ఎన్నో వేల ఉద్యోగాలిచ్చేదని వెల్లడించారు. అప్పట్లో వాటిపై పేపర్లలో ప్రత్యేక చర్చలు కూడా జరిగేవన్నారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ప్రజల సమస్యలు వింటూనే ఉన్నానన్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాలను సందర్శిస్తూ, ప్రజలతో కూర్చొని వారి సమస్యలను విని వాటి పరిష్కరిస్తునన్నారు. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని మేం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నామని నితీశ్ కుమార్ అన్నారు.
గతంలో సాధారణ, రైల్వే బడ్జెట్ లను వేరు వేరుగా ప్రవేశపెట్టే వారు. కానీ 2017లో రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ లో విలీనం చేశారు. ఇక అప్పటి నుంచి ఆ రెండు బడ్జెట్ లను కలిపి ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్ లో ప్రవేశ పెడుతూ వస్తున్నారు.