బిహార్ ఐపీఎస్ వినయ్ తివారీని ముంబైలో మున్సిపల్ అధికారులు క్వారంటైన్ చేయడం వివాదానికి దారి తీస్తోంది. ఈ వ్యవహారంపై బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వినయ్ తివారీ విషయంలో ముంబై అధికారులు అలా చేయడం సరికాదు. ఇది రాజకీయపరమైన విషయం కాదు.. పోలీసులు వారి విధులను నిర్వర్తిస్తున్నారంతే. మా డీజీపీ అక్కడి అధికారులతో మాట్లాడతారు అంటూ నితిష్ చెప్పుకొచ్చారు.
మరోవైపు బిహార్ డీజీపీ కూడా ఈ విషయంపై స్పందించారు. మహారాష్ట్ర డీజీపీ, అధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాను. ఈ విషయం గురించి ఇంతకు మించి మాట్లాడలేనంటూ ఆయన చెప్పారు.
కాగా సుశాంత్ సింగ్ కేసులో వినయ్ తివారీ ప్రత్యేక ఆఫీసర్‌గా ఉన్నారు. ఇప్పటికే ముంబైలో విచారణ జరుపుతున్న పాట్నా పోలీసులకు సాయం చేసేందుకు ఆయన్ను బిహార్ ప్రభుత్వం పంపించింది. అయితే ఆయన ముంబై చేరుకోగానే… అక్కడి మున్సిపల్ అధికారులు బలవంతంగా క్వారంటైన్ చేశారు.