దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసు మరిచిపోకముందే.. బీహార్‌లో అలాంటి తరహా ఘటనే మరొకటి చోటు చేసుకుంది.బీహార్ లోని మోతిహరిలో ఒక వ్యక్తిని కారు ఢీకొట్టడంతో పాటు 8 కి.మీ ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి మరణించాడు.
మోతిహారి నివాసముంటున్న శంకర్ సైకిల్ పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో గోపాల్‌గంజ్ వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి సైకిల్ ని ఢీకొట్టింది. దీంతో శంకర్ ఎగిరిపడి కారు కింద ఉన్న క్యారేజీలో ఇరుక్కుపోయాడు.
దీంతో అతడిని కారు 8 కి.మీ దూరం లాక్కెల్లింది. ఆ తర్వాత డ్రైవర్ తో పాటు అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి కూడా కారును కొత్వాలోని కదమ్ చౌక్ ప్రాంతంలో ఆపి పారిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును సీజ్ చేశారు. కారు నంబర్ ఆధారంగా యజామానిని కనుక్కుంటామని పోలీసులు తెలిపారు.