కన్న తండ్రి లైంగిక వేధింపులకు గురి చేస్తుండటంతో విసుగు చెందిన ఓ బాలిక ఆ వ్యవహారాన్ని వీడియో తీసింది. దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది.
అది కాస్త పోలీసులు దృష్టికి వెళ్లడంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఘటన వివరాల్లోకి వెళితే… బీహార్ లోని సమిష్టిపూర్ లో బాలికపై ఆమె తండ్రి కొన్ని రోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు.
ఈ క్రమంలో తండ్రి లైంగిక వేధింపులను బాలిక భరించలేకపోయింది. దీంతో తండ్రి వేధింపులు జరుపుతుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది.
వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో బాధితురాలని స్టేషన్ కు పిలిపించారు. ఆమె నుంచి ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు మొదలు పెట్టారు. బాలిక ఫిర్యాదు మేరకు ఆమె తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు.