బీహార్ ను మరోసారి వరదలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అక్కడ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పాట్నాలోని స్మశాన వాటికలు నీటమునిగాయి. దీంతో అంత్యక్రియలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. స్మశానాలు నీళ్లల్లో ఉండడంతో రోడ్ల పక్కనే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు స్థానికులు.
గంగానదిలో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. నదీ తీర ప్రాంతాలు చాలావరకు నీటమునిగాయి. రోడ్లపైనే అంత్యక్రియలు నిర్వహిస్తుండడంపై స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.