ఒకప్పుడు సినిమాల్లోగానీ, సీరియల్లో గానీ అవకాశాలు రావాలంటే ఎంతో కష్టపడాల్సిన పరిస్థితి. ఎంతో మంది నిరుత్సాహ పరుస్తారు..తమకి పోటీవస్తారనే అభద్రతాభావంతో తొక్కెయ్యాలని చూస్తారు.
అయితే ఒకటి మాత్రం నిజం. అరచేతితో సూర్యుణ్ణి ఆపలేరు.అలాగే ప్రజాపరం కావాల్సిన టేలెంట్ ను కూడా ఆపలేరు. ప్రతిభ ఎప్పటికైనా పైకి వస్తుంది. ప్రస్తుత కాలంలో మరుగున పడిన టాలెంట్ ని వెలుగులోకి తెచ్చే అతిపెద్ద వేదిక సోషల్ మీడియా.
ఈ మాధ్యమం ద్వారా వెలుగులోకి రావాలని చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.కొందరు ట్రెండింగ్లో ఉన్న పాటలకు డ్యాన్స్ చేసి వీడియోలు పోస్ట్ చేస్తూ మంచి పేరు సంపాదించు కుంటున్నారు.
దాంతో పాటు అవకాశాలను పొందుతున్నారు. మరికొందరు తమ అద్భుతమైన గాత్రంతో పాటలు పాడి వీడియోలను షేర్ చేస్తున్నారు. అవి కాస్తా క్షణాల్లో వైరల్గా మారి ఫేమస్ అవుతున్నారు.
బిహార్కు చెందిన అమర్జీత్ జైకర్ అనే యువకుడు కూడా ఆ కోవకు చెందినవాడే. రాత్రికి రాత్రే స్టార్ సింగర్గా మారిపోయాడు సమస్తిపుర్ పోలీస్స్టేషన్ పరిధిలోని షాపుర్ పటోరి భభూవ గ్రామమే అమర్జీత్ స్వస్థలం. చదువుకుంటూ.. స్థానికంగా జరిగే పెళ్లిళ్లకు క్యాటరింగ్ బాయ్గా పనిచేసేందుకు అమర్జీత్ వెళ్లేవాడు.
అలా మెల్లమెల్లగా డబ్బులు సంపాదించడం ప్రారంభించాడు. కొన్ని రోజుల తర్వాత.. క్యాటరింగ్ బాయ్గా కాకుండా వివాహ వేడుకల్లో పాటలు పాడేవాడు. అనేక చోట్ల స్టేజీ షోలు కూడా ఇచ్చాడు.
దాంతో పాటు అప్పుడప్పుడు తన సోషల్ మీడియా ఖాతాల్లో తాను పాడిన వీడియోలను పోస్ట్ చేసేవాడు. ఇటీవలే బాలీవుడ్లో ఫేమస్ అయిన ‘దిల్ దే దియా హై పా’ పాట పాడిన వీడియోను షేర్ చేశాడు.
Who is this guy ? Fabulous. Please send his contact no.
Thanks https://t.co/eMbPy8n38b— Nitu Chandra Srivastava (@nituchandra) February 21, 2023
ఒక్కసారిగా ఆ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. దీంతో అతడు ఓవర్ నైట్ స్టార్గా మారిపోయాడు. అయితే అమర్జీత్ వీడియో చూసిన కొందరు బాలీవుడ్ ప్రముఖులు.. అతడిని ప్రశంసించారు.
मैं जीवन जी लूं मंच पे मेरा मंच ही समशान हो #Amarjeetjaikar pic.twitter.com/AGeBfpiqpb
— Amarjeet Jaikar (@AmarjeetJaikar3) February 24, 2023
బీటౌన్ స్టార్ హీరో సోనూసూద్.. అమర్జీత్ వీడియోను రీషేర్ చేశారు. సోనూసూద్తో పాటు నటి నీతూచంద్ర.. అతడిపై ప్రశంసలు కురిపించారు. “ఈ వ్యక్తి ఎవరు? అద్భుతం. దయచేసి అతడి కాంటాక్ట్ నంబర్‌ను పంపండి.” అంటూ ట్వీట్ చేశారు.
“సోషల్మీడియాలో ఒక్కసారిగా నా వీడియో వైరల్ కావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. మా నాన్నకు చిన్న సెలూన్ ఉంది. ప్రస్తుతం నేను చదువుకుంటున్నాను. చుట్టుపక్క గ్రామాల్లో స్టేజ్ షోలు కూడా ఇస్తున్నాను. నేను పాడిన ‘దిల్ దే దియా హై పా’ పాట వీడియో చూసి నటి నీతూచంద్ర కాల్ చేశారు. త్వరలోనే ముంబయికి పిలిపిస్తానని ఆఫర్ ఇచ్చారు.”అని చెప్పుకొచ్చాడు అమర్ జీత్.