కస్టమర్లను ఆకట్టుకోడానికి విచిత్రమైన ఆఫర్లను ప్రకటిస్తుంటాయి వ్యాపార సంస్థలు..అలాంటి ప్రకటనే ఇది… పూణేలోని శివరాజ్ హోటల్ యజమాని…. “భోజనం చెయ్యండి – రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ గెలవండి!” అనే ఆఫర్ ను ప్రకటించాడు.
ఆ ప్లేట్ పేరు కూడా బుల్లెట్ మీల్ అని పెట్టాడు…ఆ బుల్లెట్ మీల్ లో మొత్తం 4 కేజీల బరువుతో కూడిన ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. అందులో మటన్ , చికెన్, ఫిష్ కు సంబంధించిన ఐటమ్స్ కూడా ఉంటాయి. కేవలం ఒక్క మనిషి 60 నిమిషాల్లో ఈ ఫుడ్ తింటే రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ను ఇచ్చేస్తారట! ఈ ప్లేట్ ఫుడ్ ధర మాత్రం 2500/-.
కస్టమర్లను మరింతగా ఆకర్షించడానికి 5 రాయల్ ఎన్ ఫీల్డ్ బండ్లు షాప్ ముందు షో కోసం పెట్టాడట ఓనర్ అతుల్ వైకర్! ‘పహల్వాన్ థాలి’, ‘మల్వాని ఫిష్ థాలి’, బకాసుర్ థాలి చికెన్ థాలి’ మరియు ‘సర్కార్ మటన్ థాలి అనే పేర్లతో ఈ హోటల్ లో ఇంతకు ముందే ఇలాంటి చాలా ఆఫర్లను రన్ చేశారట!