బిగ్ బాస్ అంటేనే బంగారు కొండ. అందులో గెలిస్తే పేరుతో పాటు డబ్బు కూడా గ్యారెంటీ. తాజాగా బిస్ బాస్ విన్నర్ గా నిలిచిన బిందుమాధవి తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చుకుంది. క్రేజ్ ను అమాంతం పెంచుకుంది. రేపోమాపో ఆమెకు అవకాశాలు క్యూ కట్టబోతున్నాయి. మరి డబ్బులు సంగతేంటి?
బిగ్ బాస్ విన్నర్ కు ఇచ్చే ప్రైజ్ మనీ నుంచి ఆల్రెడీ 10 లక్షలు తగ్గిపోయింది. 50 లక్షల ప్రైజ్ మనీ నుంచి 10 లక్షల్ని అరియానా ఎగరేసుకుపోయింది. ఇక టైటిల్ విన్నర్ బిందుమాధవికి మిగిలింది 40 లక్షలు మాత్రమే. అయితే ఈ 40 లక్షలతో పాటు అదనంగా కోటి రూపాయలు సంపాదించిందట ఈ బ్యూటీ.
బిగ్ బాస్ హౌజ్ లో కొనసాగడానికి వారానికి 5 లక్షలు ఛార్జ్ చేసిందట బిందుమాధవి. అలా ఆమె 12 వారాల పాటు కొనసాగింది. అంటే 60 లక్షలన్నమాట. అలా ప్రైజ్ మనీతో కలిపి కోటి రూపాయలు సంపాదించుకుంది ఈ చిన్నది. అయితే ఇలాంటి క్యాష్ ప్రైజ్ లకు ట్యాక్సులు ఎక్కువగా కట్టాల్సి ఉంటుంది. అలా ట్యాక్సులు పోనూ, బిందుకు 80 లక్షలు మిగిలినట్టు చెబుతున్నారు.
అయితే ఎంత సంపాదించాననేది బిందుమాధవి ఆలోచించడం లేదు. ఆమె టార్గెట్ మొత్తం ఇప్పుడు టాలీవుడ్ పై ఉంది. బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ తో ఆమె మరోసారి టాలీవుడ్ లో ఓ వెలుగు వెలగాలని చూస్తోంది. సెకెండ్ ఇన్నింగ్స్ ను గ్రాండ్ గా లాంఛ్ చేయాలని భావిస్తోంది.