
బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ తిరిగి ప్రారంభమైంది. నిపుణుల కమిటీ సూచనల మేరకు ఫ్లైఓవర్ స్పీడ్ కంట్రోల్‌కు అధికారులు చర్యలు చేపట్టగా… సీపీ సజ్జనార్, మేయర్ బొంతు రామ్మెహన్ శనివారం ఉదయం ఫ్లైఓవర్‌ను పరిశీలించారు. అనంతరం ఫ్లైఓవర్‌పై వాహనాల రాకపోకలకు అనుమతించారు.
నవంబర్ 23న ఈ వంతెనపై నుండి కారు అదుపు తప్పి ఫ్లైఓవర్‌పై నుండి కింద పడింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా, మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. డిజైన్ లోపం ఉందని, కొందరు బడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం డిజైన్ మార్చి… భూసేకరణ చేయలేదన్న విమర్శలతో ఫ్లైఓవర్‌ను మూసివేశారు.