తెలంగాణ రాష్ట్రంల ఏర్పడ్డాక తొలి సారిగా గ్రూప్-1 పరీక్ష ఈ రోజు జరుగుతోంది. ఈ పరీక్షకు పలు ఆటంకాలు ఎదురయ్యాయి. గ్రూప్-1 పరీక్షకు తొలిసారిగా బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని టీఎస్‌పీఎస్పీ తీసుకు వచ్చింది.
కొన్ని ఎగ్జామ్ సెంటర్లలో బయోమెట్రిక్ ట్యాబ్ లు పనిచేయకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. సగానికి పైగా విద్యార్థుల వేలి ముద్రలను ట్యాబ్ తీసుకోకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఓ ఒకవైపు పరీక్ష సమయం సమీపిస్తుండటం, మరోవైపు థంబ్స్ పడకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందారు.
నిజాం కాలేజీ ఎగ్జామ్ సెంటర్‌లో గ్రూప్ 1 అభ్యర్థులు థంబ్ పడకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఒక్కో అభ్యర్థి చాలా సార్లు వేలి ముద్రలు వేసినప్పటికీ పడకపోవడంతో తీవ్ర ఆందోళన చెందారు.
ట్యాబ్‌లో సమస్యలు తలెత్తడంతో అభ్యర్థులు భారీగా క్యూలైన్ లో ఎదురు చూశారు. పరీక్షా సమయం దగ్గర పడుతుండటంతో తొందరగా పరీక్షా హాల్ లోకి పంపాలని విద్యార్థులు కోరారు. ఈ క్రమంలో అధికారుల తీరుపై అభ్యర్థులు అసహనం వ్యక్తం చేశారు.