ఓపెన్ చేసిన 20రోజుల్లోనే నిత్యం ప్రమాదాలతో ముగ్గురు చావుకు కారణమైన బయోడైవర్సిటి ఫ్లైఓవర్‌ను మరో పది రోజుల్లో రీపేన్ చేయబోతున్నారు. ఫ్లైఓవర్‌లో ప్రమాదకర మలుపులు ఉండటంతో… ప్రమాదాలకు కారణం అవుతుందని, ఫ్లైఓవర్ డిజైన్‌లో లోపం ఉందని ఆరోపణలు రావటంతో ప్రభుత్వం నియమించిన నిపుణల కమిటీ నివేదిక ఇచ్చింది.
డిజైన్‌లో లోపం లేదని నిపుణుల కమిటీ తేల్చిందని, అయితే… వాహనాల గరిష్టం వేగం 40కి మించకుండా చర్యలు తీసుకోవాలని సూచించిందని జీహెచ్‌ఎంసీ కమీషనర్ తెలిపారు. అందుకోసం తాత్కాలిక చర్యలు చేపట్టామని… ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడి తాత్కాలిక భారీకేడ్స్ ఏర్పాటు చేయటంతో పాటు, వాహాన వేగాన్ని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వీక్ డేస్‌లో ఫ్లైఓవర్‌పై గరిష్ట వేగం 25కి మించే అవకాశం లేదని కానీ వీకెండ్స్‌లో మాత్రం వాహనాల వేగం ఎక్కువగా ఉంటుందని కమిటీ అభిప్రాయపడింది. దీంతో వీకెండ్స్‌లో ఫ్లైఓవర్ క్లోజ్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే పది రోజుల్లోపు ఇండియన్ కాంగ్రెస్ నిబంధనల మేరకు వాహన వేగం నియంత్రించేలా చర్యలు తీసుకుంటామని… ఫ్లైఓవర్‌పై మళ్లీ వాహనాల రాకపోకలకు అనుమతించే అవకాశం కనపడుతోంది.