బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ డిజైన్‌లోనే లోపం ఉందని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. బయో డైవర్సిటీ రోడ్డు ప్రమాదం తర్వాత ఫ్లైఓవర్‌ను మూసివేసి… అధ్యయనం చేసిన ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఈ మేరకు జీహెచ్‌ఎంసీకి నివేదిక సమర్పించింది. గరిష్ట వేగం 40 దాటితే… ప్రమాదాల తప్పవని, ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించకుండా రాజీపడటం వల్లే ఫ్లైఓవర్‌లో మలుపులు ఎక్కువగా వచ్చాయని… అందుకే ప్రమాదాలు జరుగుతున్నాయని కమిటీ స్పష్టం చేసింది.
ప్రభుత్వం నియమించిన ఈ కమిటీలో ప్రపంచ బ్యాంకు రోడ్డు భద్రత విభాగం అడ్వైజర్ ప్రొ.నాగభూషణరావు, డాక్టర్ టీఎస్ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాస్‌కుమార్, ప్రదీప్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఈ ఫ్లైఓవర్‌పై రెండు అత్యంత ప్రమాదకర మలుపులున్నాయని… కమిటీ అభిప్రాయపడింది. ఎస్సార్డీపీ కింద చేపట్టిన ఈ ఫ్లైఓవర్ నిర్మాణం నవంబర్ 4నుండి అందుబాటులోకి రాగా… దాదపు 15 రోజుల వ్యవధిలోనే రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.
అయితే… భూసేకరణలో రాజీ పడ్డ భూమి సీఎం కేసీఆర్ సన్నిహితులదని, ఓ బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి అయినందునే అధికారులు కూడా ఏమీ చేయలేకపోయారని, కానీ ఆ తప్పే ఇప్పుడు ప్రజల చావులకు కారణమవుతుందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.