బర్డ్ ఫ్లూ క్రమంగా భారత్‌ను చుట్టేస్తోంది. ఒక్కొక్కటిగా రాష్ట్రాలు బాధిత జాబితాలోకి వెళ్లిపోతున్నాయి. తాజాగా మహారాష్ట్ర, ఢిల్లీలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయినట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో బర్డ్ ఫ్లూ సంక్రమించిన రాష్ట్రాలు తొమ్మిదికి చేరాయి. కాగా చత్తీస్‌ఘడ్‌లోనూ ఈ వైరస్ ఆనవాళ్లు కనిపిస్తున్నాయని అక్కడి అధికారులు కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అయితే ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే కేరళ, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలు రోజూ వేలాది కేసులతో వణికిపోతున్నాయి.
బర్డ్ ప్లూ విస్తరిస్తుండటంతో పార్లమెంటరీ స్థాయి సంఘం అత్యవసరం సమావేశం ఏర్పాటు చేసింది. వైరస్ నివారణకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలని ఇప్పటికే కేంద్రం అధికారులను ఆదేశించింది. ఇటు ఇప్పటికే వైరస్ విస్తరించకుండా తగు చర్యలు చేపట్టాల్సిందిగా రాష్ట్రాలకు సూచనలు చేసింది. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశించింది.