కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండలం ప్రజలు తమ ఆవేదనను వెలిబుచ్చారు. ఆదివారం వారు మాట్లాడుతూ.. గత తొమ్మిది నెలల నుంచి సబ్ ఇన్స్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్ఐ) లేకపోవడంతో పలు సమస్యలను ఎదుర్కొంటున్నామని, చాలా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రాజారాం ఎస్ ఐగా వచ్చినా మూడు నెలలు ఉన్నారు. ఆ తర్వాత ముసురుద్దీన్ ఒక నెల, రాజేష్ 8 నెలలు ఉన్నారని తెలిపారు.
రాజారాం గారు కామారెడ్డి నుండి బీర్కూరుకు ఎస్ఐగా వచ్చి, మూడు నెలలు తిరగకముందే ఆకస్మికంగా ట్రాన్స్ ఫర్ అయ్యారు. ఇప్పటివరకు అందుకు గల కారణాలు ఏమీ తెలియవని బీర్కూరు మండల ప్రజలు చెప్పారు. స్థానికంగా మితిమీరిన రాజకీయ జోక్యం ఎక్కువగా ఉండటం దీనికి కారణమంటూ వారు చెబుతున్నారు. మండలంలో మంజీరా నది పరిహాక ప్రాంతం ఇక్కడ ఇసుక ఎక్కువగా ఉంటుందని, దీంతో అక్రమ ఇసుకను ఎక్కువగా తరలిస్తూ ఉంటారని అంటున్నారు.
రాత్రి, పగలు అనే తేడా లేకుండా.. ఏ పర్మిషన్ లేకుండా ఎమ్మార్వో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇసుకను టిప్పర్రు, లారీలు, ట్రాక్టర్ ల ద్వారా అక్రమ రవాణా చేస్తున్నారన్నారు. ఒకవేళ వాటిని పోలీసులు పట్టుకుంటే గల్లీ లీడర్ నుంచి మండల లీడర్ వరకు ఫోన్ చేసి మా బండ్లను విడిచి పెట్టాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు.
అలా వినకపోతే పెద్ద లీడర్ తో ఫోన్లు చేయిస్తున్నారని చెబుతున్నారు. అందుకే ఈ తలనొప్పులు మాకెందుకు అని ఎస్ఐలు రావడానికి జంకుతున్నారని బీర్కూర్ మండల ప్రజలు విమర్శలు చేస్తున్నారు. 9 నెలల నుంచి ఎస్ఐ లేకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నామని స్థానిక ప్రజలు వాపోతున్నారు.