సీఆర్‌డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమెదం తెలపడంపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గవర్నర్ నిర్ణయానికి నిరసనగా ఎమ్మెల్సీ బీటెక్ రవి తన పదవికి రాజీనామా చేశారు.
సీఆర్‌డీఏ రద్దు, మూడు రాజధానుల ఏర్పాటు కొరకై రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులపై గవర్నర్ సంతకం చేయడం అప్రజాస్వామిక చర్య. శాసన మండలిలో ఆ బిల్లులు ఆమోదమే పొందలేదు. అలాంటి బిల్లులను గవర్నర్ ఆమోదించడాన్ని నేను రాజ్యాంగ వ్యతిరేక చర్యగా భావిస్తున్నాను. ప్రాధాన్యత లేని చట్టసభల్లో ఉండటం అనవసరమని భావించి రాజీనామా చేస్తున్నాను. మండలి ఛైర్మన్‌కు సంబంధిత ఫార్మెట్‌లో నా రాజీనామా లేఖను పంపిస్తాను అంటూ లేఖలో బీటెక్ రవి ఆవేద వ్యక్తం చేశారు.