సామాన్యంగా ఆకాశం నీలం రంగులో ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అరుణ వర్ణాన్ని సంతరించుకొని ఆహ్లాదాన్ని కలిగిస్తుంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఆకాశం గులాబీ రంగులో ధగధగ మెరిసిపోవడం మొదలైంది. అది చూసిన స్థానికులు భయంతో వణికిపోయారు.
ఇంతకు ఈ వింత ఎక్కడ జరిగిందంటే ఆస్ట్రేలియాలోని ఓ నగరంలో చోటు చేసుకుంది.ఏలియన్స్ ఏమైనా తమ సిటీ మీద దాడి చేస్తున్నారా? అని భయపడిపోయారు. ఇంతలా వారిని వణికించిన ఈ దృశ్యాన్ని కొందరు ఫొటోలు తీసి నెట్టింట షేర్ చేశారు.
ఈ ఫొటోలను కొంచెం జాగ్రత్తగా గమనిస్తే.. ఆ వెలుతురు నేల మీద నుంచే ఆకాశంలోకి వెళ్తున్నట్లు కనిపించింది. దీనికి కారణం ఏంటని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. స్థానికంగా ఉన్న ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ కాన్ గ్రూప్.. తమ గంజాయి తోటలో తెరలు కప్పడం మర్చిపోయిందట.
దాంతో ఆ లైట్ల వెలుగు ఆకాశంలో ఫోకస్ అవడం వల్లనే ఇలా గగనతలం అంతా పింక్ కలర్‌లో వెలిగిపోయిందని తేలింది. దాంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే దీనికి సంబంధించిన ఫొటోలు మాత్రం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి.
ఏది ఏమైనప్పటికీ ఆకాశం గులాబీ రంగులోకి మారడం మాత్రం చూపరులను ఆకట్టుకోంది.ప్రస్తుతం ఈ చిత్రాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
I’ll leave the humor to others. 🤣
“Mysterious pink glow in sky over Australian town revealed to be from local #cannabis facility” #Australiahttps://t.co/JHhsZTTtpr pic.twitter.com/OhlRhiFguJ
— Bill Lamb (@zachvat) July 21, 2022